భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గ స్థాయి అవగాహన సదస్సు బుధవారం ఘనంగా జరిగింది. స్థానిక బి.వి.ఆర్.ఐ.టి కళాశాల ఆడిటోరియంలో నియోజకవర్గంలోని 9 మండలాల సర్పంచులు, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సుహాసిని రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యా వారోత్సవాలు, ‘బడిబాట’ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా…
పాఠశాలల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి





