భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, మే 2026, శనివారంభారత్ సమాచార్

అంతర్జాతీయ వేదికపై మహబూబాబాద్ జిల్లా విద్యార్థులు

WhatsApp Image 2026-05-15 at 8.23.34 PM

భార‌త్ స‌మాచార్.నెట్, మహబూబాబాద్ : జిల్లా విద్యార్థులు అంతర్జాతీయ వేదికపై తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోని టీజీఐఆర్డీ (TGIRD)లో ఈనెల 15 నుంచి 17 వరకు నిర్వహించే ప్రతిష్టాత్మక ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’ (MUN) కార్యక్రమానికి జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర సోషల్ టీచర్స్ ఫోరం ఉపాధ్యక్షురాలు, నెల్లికుదురు మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు అంజుమ్ సుల్తానా శుక్రవారం వెల్లడించారు.

ఎంపికైన విద్యార్థులు జపాన్, మెక్సికో, మలేషియా, లెబనాన్, జోర్డాన్ వంటి వివిధ దేశాల ప్రతినిధులుగా వ్యవహరిస్తూ.. యునిసెఫ్ (UNICEF) అంశంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చించనున్నారని ఆమె వివరించారు. నెల్లికుదురు పీఎం శ్రీ పాఠశాల నుండి సిరివెన్నెల ఈ కార్యక్రమానికి ఎంపిక కావడం విశేషం. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, డీఈవో సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అంజుమ్ సుల్తానా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇలాంటి ఉన్నత వేదికలకు ఎంపిక కావడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. కార్యక్రమంలో సోషల్ టీచర్స్ ఫోరం జిల్లా నాయకులు దేశినేని వెంకన్న గూడయాకూబ్ పాల్గొన్నారు.