భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ : జిల్లా విద్యార్థులు అంతర్జాతీయ వేదికపై తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోని టీజీఐఆర్డీ (TGIRD)లో ఈనెల 15 నుంచి 17 వరకు నిర్వహించే ప్రతిష్టాత్మక ‘మోడల్ యునైటెడ్ నేషన్స్’ (MUN) కార్యక్రమానికి జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర సోషల్ టీచర్స్ ఫోరం ఉపాధ్యక్షురాలు, నెల్లికుదురు మోడల్ స్కూల్ ఉపాధ్యాయురాలు అంజుమ్ సుల్తానా శుక్రవారం వెల్లడించారు.
ఎంపికైన విద్యార్థులు జపాన్, మెక్సికో, మలేషియా, లెబనాన్, జోర్డాన్ వంటి వివిధ దేశాల…





