భారత్ సమాచార్, (ఇనుగుర్తి), మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ గ్రామ అధ్యక్షులు కామినేని భిక్షం ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ మంగళవారం ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. ఒత్తిడికి గురి కాకుండా వేళకు మెడిసిన్ వాడుతూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఇటీవల కన్నుమూసిన స్వర్గీయ తండ ముత్తమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆమె కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు బైరు అశోక్ గౌడ్, సత్యపాల్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కొట్టం రాము, కదిర జగన్, కాలేరు శివాజీ, సురేష్, ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నరసింహ, చందు, నరేష్, మల్లేశం, రాజేందర్రెడ్డి, వెంకన్న, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
20, మే 2026, బుధవారంభారత్ సమాచార్