భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, మే 2026, ఆదివారంభారత్ సమాచార్

ఓటర్ల మ్యాపింగ్‌లో రాష్ట్రంలోనే మహబూబాబాద్ ఫస్ట్: కలెక్టర్

WhatsApp Image 2026-05-23 at 7.08.41 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ముందస్తు సన్నాహాల్లో భాగంగా చేపట్టిన ఓటర్ల మ్యాపింగ్‌లో మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో అత్యధికంగా 92.24 శాతం మ్యాపింగ్ పూర్తయిందని కలెక్టర్ స్నేహ శబరిష్ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వలసలు, మరణాల వల్ల ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న తప్పులను సరిదిద్ది, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఈ సవరణ ముఖ్య లక్ష్యమన్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు పారదర్శకంగా ఓటరు జాబితాను రూపొందిస్తున్నారని, ప్రస్తుతం జరుగుతున్న మ్యాపింగ్‌లో ఓటర్లు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలని సూచించారు. ఈ ప్రక్రియకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీ ప్రతినిధులు మార్నేని వెంకన్న, సురేష్ నాయుడు, శ్యామ్ లోయ శర్మ, చక్రపాణి, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, సూపర్డెంట్ కిరణ్, రంజిత్ తదితరులు ఉన్నారు.