భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ముందస్తు సన్నాహాల్లో భాగంగా చేపట్టిన ఓటర్ల మ్యాపింగ్‌లో మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో అత్యధికంగా 92.24 శాతం మ్యాపింగ్ పూర్తయిందని కలెక్టర్ స్నేహ శబరిష్ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్‌తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వలసలు, మరణాల వల్ల ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న తప్పులను సరిదిద్ది, అర్హులైన…


