భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, మే 2026, మంగళవారంభారత్ సమాచార్

ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారమే రక్షణ

WhatsApp Image 2026-05-25 at 5.43.01 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో గర్భిణులు, బాలికలు ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం పౌష్టికాహారం తీసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మీ సూచించారు. సోమవారం రైతు వేదికలో మహిళా సంక్షేమ వారోత్సవాలు ప్రారంభించిన ఆమె పౌష్టికాహార ప్రదర్శనను పరిశీలించి పోషణ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించగా.. మున్సిపల్ కమిషనర్ సాయికుమార్, కౌన్సిలర్లు, మెడికల్ ఆఫీసర్ సాయి దీప్తి, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.