భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా నర్సాపూర్‌లో గర్భిణులు, బాలికలు ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం పౌష్టికాహారం తీసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ సూచించారు. సోమవారం రైతు వేదికలో మహిళా సంక్షేమ వారోత్సవాలు ప్రారంభించిన ఆమె పౌష్టికాహార ప్రదర్శనను పరిశీలించి పోషణ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించగా.. మున్సిపల్ కమిషనర్ సాయికుమార్, కౌన్సిలర్లు, మెడికల్ ఆఫీసర్ సాయి దీప్తి, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారమే రక్షణ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




