భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, మే 2026, బుధవారంభారత్ సమాచార్

కెనరా బ్యాంకు ముందు రైతుల ధర్నా

WhatsApp Image 2026-05-26 at 8.56.26 PM

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కెనరా బ్యాంకు ముందు రైతులు, వృద్ధులు, ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. కెనరా బ్యాంకు మేనేజర్ ఇటీవల బదిలీ కావడంతో అతని స్థానంలో మరో అధికారి వచ్చి సెలవులపై వెళ్లడంతో లావాదేవీలు స్తంభించిపోయి తమకు డబ్బులు అందలేదు. దీంతో ఖాతాదారులు ఇబ్బందిపడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సర్పంచ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఖాతాదారులు బ్యాంక్ సిబ్బంది ఎవరు సక్రమంగా లేకపోవడంతో తాము లావాదేవీలు ఎలా జరపాలని ఖాతాదారులు రైతులు బ్యాంకు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఆగ్రహించిన వారు బ్యాంక్ ముందు ధర్నా చేపట్టారు. వారం రోజులుగా బ్యాంకులోకి డబ్బులు రాకపోవడంతో వాటి కోసం బ్యాంకు వద్ద ఎండకు ఎండుతూ ఇబ్బందులు పడుతూ పడికాడ్పులు కాస్తున్నామన్నారు. డబ్బులు విషయంలో బ్యాంకులో మేనేజర్ లేకపోవడంతో ఎలా డబ్బులు వస్తాయని తాము అడిగే ప్రశ్నలకు జవాబురితనం ఇవ్వడం లేదన్నారు. ఈ సమస్యను ఆర్ఎం దృష్టికి తీసుకెళ్తానని మేనేజర్ తెలిపారు. సర్పంచ్‌తో ఫోన్‌లో మాట్లాడించినట్లు తెలిపారు. ముఖ్యంగా రైతులు పండించిన ధాన్యం డబ్బులు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్ ఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు స్పందించి ఖాతాదారులకు రైతులకు డబ్బులు చెల్లింపులు చేయించాలని బ్యాంకు ముందు బైఠాయించడంతో.. రెండు రోజుల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ఆర్ఎం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగరాజు నర్సింలు శ్రీనివాస్ ఖాతాదారులు రైతులు పాల్గొన్నారు.