భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగేల్లి నర్సయ్య కన్నుమూత బాధాకరమని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ విచారం వ్యక్తం చేశారు. మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు సుధీర్‌కు పితృవియోగం కావడంతో సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే మురళి నాయక్ బుధవారం ఇనుగుర్తికి చేరుకొని స్వర్గీయ నర్సయ్య చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సుధీర్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆపద సమయంలోను ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్, దిశ సభ్యులు గుజ్జునూరి బాబురావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బైరు అశోక్ గౌడ్, నాయకులు గంజి రాజేందర్ రెడ్డి, చెడుపాక యాకయ్య, ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మనపల్లి సతీష్ చారి, బైరు శ్రీనివాస్ గౌడ్, వివిధ గ్రామాల వార్డ్ మెంబర్లు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
27, మే 2026, బుధవారంభారత్ సమాచార్