భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: తెలంగాణ ఆస్తులను ధ్వంసం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యలపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టే కుట్ర చేస్తున్నారని, బాల్క సుమన్ నిన్న సింగరేణి సభలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు క్షమించారని అన్నారు. ప్రజల పన్నులతో కట్టిన సింగరేణి ఆఫీసును తగులబెట్టాలి. రైల్వే లైను కోసి వేయాలని, మిలిటెంట్ ఉద్యమం చేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ పార్టీ అధికారం లేకపోవడంతో అరాచకం సృష్టిస్తున్నారని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అరాచక పాలనను చూసి 2023లో ప్రజలు ఇంటికి పంపించారని అన్నారు. తెలంగాణ ఆస్తులను ప్రజల ఆస్తులను ధ్వంసం చేయాలని బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని బీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు.
BHARATH SAMACHAR DIGITAL
28, మే 2026, గురువారంభారత్ సమాచార్