భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, మే 2026, శనివారంభారత్ సమాచార్

వెల్దుర్తిలో మహిళా సంఘాలకు రూ.3.92 కోట్ల రుణాలు

WhatsApp Image 2026-05-29 at 7.19.57 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: వెల్దుర్తి మండలంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రుణ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఆరు బ్యాంకుల ద్వారా 31 స్వయం సహాయక సంఘాలకు రూ.3.92 కోట్ల రుణాలు మంజూరు చేస్తూ దానికి సంబంధించిన శాంక్షన్ లేఖలను లబ్ధిదారులకు అందజేశారు. దీంతో పాటు, ‘మహిళా శక్తి’ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధి కోసం పెరటి కోళ్లను పంపిణీ చేశారు. మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత ఎదగాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సుభాష్ గౌడ్, డీసీసీబీ బ్యాంక్ మేనేజర్ హరికిషన్, టీజీబీ బ్యాంక్ మేనేజర్ మధు, సీసీలు సుల్తానా, విజయలక్ష్మి, లక్ష్మణ్, స్వప్న, మండల సమాఖ్య అధ్యక్షురాలు రూప, కార్యదర్శి భాగ్యారాణి, ఎంఎస్ఏ గీత, ఎంసీవో గంగాధర్, గ్రామ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.