భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి: బషీర్బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆదివారం ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉద్యమకారుల ప్రతినిధుల సదస్సను నిర్వహించారు. రాష్ట్రంలోని మండల కమిటీలు, జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీల పదవులలో ఉన్న ఉద్యమ ముఖ్య నాయకులు, మహిళ నాయకురాలు, తొలి దశ, మలి దశ ఉద్యమకారులు, కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా కేకే కమిటీ సభ్యులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేకే కమిటీ ప్రకటించినందుకు గాను స్వాగతిస్తూ కృతజ్ఞతా భావంతో ఈ సభను నిర్వహిస్తున్నట్లు, ఉద్యమకారుల డిమాండ్లు రూ.12 వేల కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ బస్సులలో ట్రైన్లలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు జారీ చేయాలని 250 గజాల ఇంటి స్థలంలో ఇంటిని నిర్మించి ఇవ్వాలని, ప్రతినెల రూ.25 వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఉద్యమ కాలంలో మరణించిన వారి కుటుంబాలను, వికలాంగులైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అర్హులైన ప్రతి ఉద్యమకారున్ని గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని ఇకనైనా కేకే కమిటీతో కాలయాపన చేయకుండా త్వరగా ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరారు.
BHARATH SAMACHAR DIGITAL
31, మే 2026, ఆదివారంభారత్ సమాచార్