భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

5, జూన్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

తప్పిన పెను ప్రమాదం

WhatsApp Image 2026-06-04 at 9.02.43 PM

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తి అన్నారం ప్రధాన రహదారి గుంటి చెరువు కల్వర్టు వద్ద పెను ప్రమాదం తప్పింది. కల్వర్టు వద్ద మూలమలుపు రోడ్డు వర్షపు నీటి కోతలకు గురై ఇరుకుగా మారింది. పాల్వంచ కొత్తగూడెంకు చెందిన ఓ కుటుంబం తమ కొత్త కారుకు పర్వతగిరి మండలం అన్నారంలో గురువారం పూజలు చేయించుకుని తిరుగు ప్రయాణం మేచరాజపల్లి మీదుగా ఇనుగుర్తికి వస్తున్న క్రమంలో గుంటి చెరువు కల్వర్టు వద్ద ఇరుక్కు పోయి చెరువులో పడేంత పనైంది. గ్రామస్తులు జేసీబీ సహాయంతో కారును నెమ్మదిగా బయటికి తీశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కుటుంబంతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.