భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రం ఇనుగుర్తి అన్నారం ప్రధాన రహదారి గుంటి చెరువు కల్వర్టు వద్ద పెను ప్రమాదం తప్పింది. కల్వర్టు వద్ద మూలమలుపు రోడ్డు వర్షపు నీటి కోతలకు గురై ఇరుకుగా మారింది. పాల్వంచ కొత్తగూడెంకు చెందిన ఓ కుటుంబం తమ కొత్త కారుకు పర్వతగిరి మండలం అన్నారంలో గురువారం పూజలు చేయించుకుని తిరుగు ప్రయాణం మేచరాజపల్లి మీదుగా ఇనుగుర్తికి వస్తున్న క్రమంలో గుంటి చెరువు కల్వర్టు వద్ద ఇరుక్కు పోయి చెరువులో పడేంత పనైంది. గ్రామస్తులు జేసీబీ సహాయంతో…