భారత్ సమాచార్, సూర్యాపేట: ప్రజాకవి కాళోజి జయంతి సందర్బంగా తుంగతుర్తి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష మన భాష మన యాసను తన కలం ద్వారా ప్రజలకు చైతన్యాన్ని నింపిన మహనీయుడు కాళోజి అని అన్నారు. నిజాం నిరంకుశంత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు కాళోజి నారాయణ రావు అని కొనియాడారు. వారి త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియ చెప్పాల్సిన బాధ్యత మనందరిమీద ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా యకులు గుండగాని రాములుగౌడ్, మండల నాయకులు తునికి సాయిలు, గోపగాని శ్రీనివాస్, నల్లబెల్లి వెంకటేష్, వీరునాయక్ తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
9, సెప్టెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్