భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, జూన్ 2026, శనివారంభారత్ సమాచార్

రైతుల సమస్యలపై తక్షణమే స్పందించిన ఎస్పీ

WhatsApp Image 2026-06-05 at 2.52.10 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ శుక్రవారం దయరా పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డిలతో కలిసి ఆయన కేంద్రంలోని పరిస్థితులను పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడారు. ధాన్యం రవాణాకు సరిపడా లారీలు లేకపోవడం, వర్షాల ముప్పు వల్ల కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని రైతులు ఎస్పీ దృష్టికి తెచ్చారు.

దీనిపై ఎస్పీ వెంటనే స్పందిస్తూ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌తో ఫోన్‌లో మాట్లాడి, రైతులకు తక్షణమే బ్లాక్ టార్పాలిన్లు, లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు. దీనికి అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం రవాణా సజావుగా సాగేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా జిల్లా యంత్రాంగం మరియు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని ఎస్పీ స్పష్టం చేశారు.