భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని పరిష్కరించేందుకు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ శుక్రవారం దయరా పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌రెడ్డిలతో కలిసి ఆయన కేంద్రంలోని పరిస్థితులను పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడారు. ధాన్యం రవాణాకు సరిపడా లారీలు లేకపోవడం, వర్షాల ముప్పు వల్ల కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని రైతులు ఎస్పీ దృష్టికి తెచ్చారు.

దీనిపై ఎస్పీ వెంటనే స్పందిస్తూ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్‌తో…