భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, జూన్ 2026, శనివారంభారత్ సమాచార్

ఆలేరు విద్యార్థిని ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ స్కాలర్‌షిప్‌నకు ఎంపిక

WhatsApp Image 2026-06-05 at 8.44.23 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని వై. రాజేశ్వరి కేంద్ర ప్రభుత్వ జాతీయ సాధన, అర్హత ఉపకార వేతనం స్కాలర్‌షిప్‌నకు ఎంపికైంది. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి ఆంగోతు రాందాస్ శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ పరీక్షలో రాజేశ్వరి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ స్కాలర్‌షిప్‌ను సాధించినట్లు ఆయన వెల్లడించారు.

ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థినికి 9వ తరగతి నుంచి 12వ తరగతి పూర్తి వరకు ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 12,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుందని ఎంఈవో వివరించారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జాతీయ స్థాయి స్కాలర్‌షిప్‌నకు ఎంపిక కావడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామస్థులు రాజేశ్వరిని ప్రత్యేకంగా అభినందించారు.