భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని వై. రాజేశ్వరి కేంద్ర ప్రభుత్వ జాతీయ సాధన, అర్హత ఉపకార వేతనం స్కాలర్‌షిప్‌నకు ఎంపికైంది. ఈ మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి ఆంగోతు రాందాస్ శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్ పరీక్షలో రాజేశ్వరి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ స్కాలర్‌షిప్‌ను సాధించినట్లు ఆయన వెల్లడించారు.

ఈ పథకం కింద ఎంపికైన విద్యార్థినికి 9వ తరగతి నుంచి 12వ…