భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

11, జూన్ 2026, గురువారంభారత్ సమాచార్

బీవీఆర్‌ఐటీలో అంతర్జాతీయ ‘వామ్స్ 2026’ సదస్సు ప్రారంభం

WhatsApp Image 2026-06-10 at 5.51.25 PM

భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: నర్సాపూర్ లోని బి.వి. రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బీవీఆర్‌ఐటీ) వేదికగా 5వ అంతర్జాతీయ వైర్లెస్, యాంటెన్నాస్ అండ్ మైక్రోవేవ్ (వామ్స్-2026) సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. జూన్ 10 నుంచి 13 వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ సదస్సును అమెరికాకు చెందిన లింట్రిస్ చీఫ్ ఇంజనీర్ ఫిల్ వెనిజియా, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ఉపాధ్యక్షులు రవిచంద్రన్ రాజగోపాల్, కార్యదర్శి ఆదిత్య విస్సంలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. సంజయ్ దూబే మాట్లాడుతూ.. 6G సాంకేతికతలు, యాంటెన్నా వ్యవస్థలపై పరిశోధనలకు ఇది ఒక గొప్ప వేదికని పేర్కొన్నారు. సదస్సు చైర్మన్ డా. బి.ఆర్. సంజీవ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా, ఆస్ట్రేలియా సహా 18 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారని, అందిన 1,059 పరిశోధనా పత్రాల్లో 753 పత్రాలను ప్రజెంటేషన్లకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఐఐటీలు, ఐఐఎస్సీ, ఎన్ఐటీలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశ్రమల నిపుణులు ఈ మేధోమథనంలో పాల్గొని భవిష్యత్ వైర్లెస్ కమ్యూనికేషన్ రంగాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.