భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, జూన్ 2026, మంగళవారంభారత్ సమాచార్

అర్వపల్లిలో బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం

WhatsApp Image 2026-06-15 at 6.10.55 PM (1)

భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో తుంగతుర్తి నియోజకవర్గ BRS పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డి, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. RS ప్రవీణ్ కుమార్ ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన (SIR) పార్టీ డిజిటల్ సభ్యత్వాలపై BLAలకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో BRS పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని, అలాగే ప్రతి పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్లు సైతం ఓటర్ లిస్ట్ పట్టుకొని BRS ఓట్లు డిలీట్ అవ్వకుండా కాపాడుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

వెస్ట్ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో చాలామంది ఓట్లు, ఓటర్ లిస్ట్‌ల నుంచి గల్లంతయ్యాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదే పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. బండి సంజయ్‌ని పరుగెత్తించిన చైతన్యం కోదాడ ప్రజలకు ఉన్నదని BJP పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఒక్కటే అని వారి మాటలు నమ్మకూడదన్నారు.

ఇప్పటి వరకు ప్రభుత్వ విద్య సంస్థల్లో చిన్నపిల్లలకు దుస్తులు కూడా ఇవ్వలేదని, పంట పండించాలంటే రైతులు హరిగోస పడుతున్నారని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా BRS పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, యాదాద్రి భువనగిరి జిల్లా BRS పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణ రెడ్డి, సూర్యాపేట మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ గుజ్జా దీపికా యుగంధర్ రావు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.