భారత్ సమాచార్, (నెల్లికుదురు), మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. మంగళవారం జిల్లా కేంద్రం మహబూబాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు చీకటి మహేష్ గౌడ్, గుగులోతు మదన్ లాల్, గడ్డం అశోక్ తదితరులు కొత్తగా చేరిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆకుల లింగయ్య, పెరుమాండ్ల యాదగిరి, వాసిరెడ్డి యాదగిరి, ఏర్పుల మహేందర్, ఆకుల శ్రీశైలం, జాగిరి శేఖర్, ఆకుల అనిల్, ఏర్పుల వీరస్వామి, సాయి మధు తదితరులను పార్టీ నాయకులు అభినందించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అవినీతి రహిత పాలనతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రతిష్ట పెరుగుతోందని, అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రజలు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడడం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కొత్తగా చేరిన నాయకులు కృషి చేయాలని సూచించారు.