భారత్ సమాచార్, (నెల్లికుదురు), మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. మంగళవారం జిల్లా కేంద్రం మహబూబాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు చీకటి మహేష్ గౌడ్, గుగులోతు మదన్ లాల్, గడ్డం అశోక్ తదితరులు కొత్తగా చేరిన నాయకులకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆకుల…