భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, జులై 2026, శుక్రవారంభారత్ సమాచార్

ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

2c119ad3-de6e-4709-a145-78784dec3bfd

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వరంగల్ మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.531 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తూ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి గురువారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా “మోదీ.. మోదీ..” అంటూ నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్ రావు మాట్లాడుతూ, ఎన్నో దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన మామునూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.531 కోట్ల నిధులు మంజూరు చేయడం తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధికి పునాది అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

గత కాంగ్రెస్ సహా పలు ప్రభుత్వాలు మామునూరు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ రాష్ట్రంలో కొందరు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులకు పాలాభిషేకాలు చేయడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వానికి తగిన గుర్తింపు ఇవ్వాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు, వద్దిరాజు రామచంద్రరావు, కళ్యాణ్ నాయక్, మదన్ లాల్, చందు రాజ్‌కుమార్, నల్లాని పాపారావు, సురేష్ నాయక్, యాకిరెడ్డి, దుంపల సందీప్, చిలుపూరి వెంకన్న, ఇందు భారతి, ముస్తఫా, తోట రమేష్, జల్లి రమేష్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.