భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వరంగల్ మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.531 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తూ మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి గురువారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా “మోదీ.. మోదీ..” అంటూ నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. గౌతమ్…





