భారత్ సమాచార్.నెట్, చెన్నై: పాకిస్థాన్ దౌత్యవేత్త అమీర్ జుబేర్ సిద్దిఖీకి చెన్నైలోని ఎన్ఐఏ కోర్టు నోటీసులు జారీ చేసింది. నకిలీ కరెన్సీ కేసుకు సంబంధించిన పాకిస్థాన్ దౌత్యవేత్తకు నోటీసులు జారి చేసినట్లు సమాచారం. అలాగే భారత్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్లపై దాడులు చేయడానికి కుట్ర పన్నినట్లు ఆ నోటీసుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కరాచీలోని అమీర్ జుబేర్ చిరునామాను కూడా నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.
అక్టోబర్ 15న చెన్నైలోని ఎన్ఐఏ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించినట్లు ఆ నోటీసుల పేర్కొంది. కాగా అమీర్ జుబేర్ సిద్ధిఖీని మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది భారత్. శ్రీలంకలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో వీసా కౌన్సిలర్‌గా అమీర్ జుబేర్ సిద్ధిఖీ చివరిగా విధులు నిర్వహించారు. 2018లో ఎన్ఐఏ అతడిని వాంటెడ్ లిస్ట్‌లో చేర్చి ఫొటోను రిలీజ్ చేసింది. వీసా కౌన్సిలర్‌గా పనిచేస్తున్న సమయంలోనే 26/11 తరహాలో భారత్‌లో దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు ఆరోపిస్తూ ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
అదేవిధంగా 2009 నుంచి 2016 మధ్య శ్రీలంకలో పనిచేస్తున్న సమయంలో గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనే వారితో సంబంధాలు నడిపినట్లు ఎన్ఐఏ గుర్తించింది. 2013లో శ్రీలంక జాతీయుడు మొహమ్మద్ జాకిర్ హుస్సేన్ అరెస్ట్‌తో అమీర్ జుబేర్‌పై తొలికేసు నమోదైంది. కాగా భారత్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్లపై దాడులు చేయాలని గుర్తించిన భారత్ దర్యాప్తు సంస్థలు తొలిసారిగా ఓ పాకిస్థాన్ దౌత్యవేత్త పేరును వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది.
మరిన్ని కథనాలు:
Terrorists: దేశంలో మరోసారి ఉగ్ర కలకలం