భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, ఆగస్టు 2026, మంగళవారంభారత్ సమాచార్

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

3c9b4b93-9d37-495a-bd45-36949423b9bd

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజావాణిలో ప్రజలు సమర్పించే ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన పరిపాలన అందించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్లు కలిసి వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోరారు.

ఈ సందర్భంగా మొత్తం 57 దరఖాస్తులు అందాయి. వాటిలో భూభారతి సంబంధిత 14, పెన్షన్లకు సంబంధించిన 7, హౌసింగ్‌కు సంబంధించిన 6, ఇతర అంశాలకు సంబంధించిన 30 దరఖాస్తులు ఉన్నాయి. ఆయా శాఖల అధికారులు ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును ప్రాధాన్యతతో తీసుకుని, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.