భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రజావాణిలో ప్రజలు సమర్పించే ఫిర్యాదులను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన పరిపాలన అందించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్లు కలిసి వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి…





