భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

6, ఆగస్టు 2026, గురువారంభారత్ సమాచార్

తహసీల్దార్ కార్యాలయంలో జయశంకర్ జయంతి

b5fcb413-d410-48bc-81bd-b4c604451b4f

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మార్వో కార్యాలయంలో గురువారం ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాస్, ఆర్‌ఐ సిద్ధరాం రెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆచార్య జయశంకర్ అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది పాల్గొని ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.