భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మార్వో కార్యాలయంలో గురువారం ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాస్, ఆర్‌ఐ సిద్ధరాం రెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆచార్య జయశంకర్ అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ…