భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: దివంగత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక సభ్యులు, జాతీయ నాయకులు గుండెపాక ఉప్పలయ్య సేవలు సమాజానికి చిరస్మరణీయమని జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి అశోద భాస్కర్ అన్నారు. స్వర్గీయ ఉప్పలయ్య ప్రధమ వర్ధంతి సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అశోద భాస్కర్ మాట్లాడుతూ పౌర సమాజ సేవలో గుండెపాక ఉప్పలయ్య చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా జాతి అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూనే, సమాజంలోని అనేక వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అని అన్నారు.
ఉద్యమ సమయంలో అనేక మందికి అండగా నిలిచి వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చారని, బడుగు బలహీన వర్గాల గొంతుకగా నిలిచి వారి హక్కుల కోసం పోరాడారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా మెలుగుతూ నిస్వార్థ సేవలు అందించిన ఉప్పలయ్య భౌతికంగా లేకపోవడం ప్రజలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు పాల్గొని ఉప్పలయ్య సేవలను స్మరించుకున్నారు. సర్పంచులు మాదరి ప్రశాంత్, యాసం సంధ్య రమేష్, కత్తుల కళ్యాణి యాకాంతం, ఉప సర్పంచ్ గుండెపాక సోమనర్సయ్య, మాజీ సర్పంచులు కస్తూరి శ్రీనివాస్, శ్రీరామ్, మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్, కాంగ్రెస్ నాయకులు దాసరి ప్రకాష్, యాకయ్య, జర్నలిస్టులు గొల్లపల్లి విజయ్ బాబు గౌడ్, జెల్ల ఉపేందర్, వెన్నం క్రాంతి రెడ్డి, మంద రవి, పులి నరసయ్య, జెల్లక వీరయ్య, బాణాల సంజీవ, రత్నపురం యాకయ్య, గార అనిల్, ఎమ్మార్పీఎస్ నాయకులు హెచ్. శ్రీనివాస్, హెచ్. రవి, హెచ్. అశోక్ తదితరులు పాల్గొన్నారు.