భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: దివంగత ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక సభ్యులు, జాతీయ నాయకులు గుండెపాక ఉప్పలయ్య సేవలు సమాజానికి చిరస్మరణీయమని జాతీయ మాల మహానాడు జాతీయ కార్యదర్శి అశోద భాస్కర్ అన్నారు. స్వర్గీయ ఉప్పలయ్య ప్రధమ వర్ధంతి సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అశోద భాస్కర్ మాట్లాడుతూ పౌర సమాజ సేవలో గుండెపాక ఉప్పలయ్య చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా జాతి అభ్యున్నతి…





