భారత్ సమాాచార్.నెట్, కరీంనగర్: ఈ నెల 14వ తేదీన కరీంనగర్‌లో జరగనున్న బీసీ మేధావుల సభను విజయవంతం చేయాలని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ్ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వీరస్వామి గౌడ్ పిలుపునిచ్చారు. జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కొంగ జపాలు చేస్తున్నాయని విమర్శించారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అధికారంలో ఉన్న సమయంలో ఈ పార్టీలు అన్యాయం చేశాయని మండిపడ్డారు.
రాజ్యాధికార దిశగా బీసీ సమాజం అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని దొంగ నాటకాలకు తెరలేపిందని.. బీజేపీ మతపరమైన రిజర్వేషన్‌తో తొండి నాటకాలు ఆడుతోందని విమర్శించారు. స్థానిక సంస్థల్లో 34 శాతం ఉన్న రిజర్వేషన్ 23 శాతానికి తగ్గించిన ఘనత బీఆర్ఎస్‌కే దక్కిందని ఏద్దేవ చేశారు. ఈ పార్టీల కుట్రలను బీసీలు పసిగట్టాలని లేదంటే మరోసారి మోసపోయే ప్రమాదం ఉందన్నారు. ఇక బీసీ మేధావులైన రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ సహా అనేక మంది బీసీఐ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో బీసీల అంశంపై దిశనిర్దేశం చేయనున్నారని చెప్పారు. ఈ సమావేశానికి విద్యార్థి నాయకులు, బీసీ సోదర సోధరీమణలు హాజరై విజయవంతం చేయాలని సూచించారు.
మరిన్ని కథనాలు:
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన కరీంనగర్ అల్ఫోర్స్ టైటాన్స్ విద్యార్థులు