భారత్ సమాాచార్.నెట్, కరీంనగర్: ఈ నెల 14వ తేదీన కరీంనగర్‌లో జరగనున్న బీసీ మేధావుల సభను విజయవంతం చేయాలని సర్వాయిపాపన్న మోకుదెబ్బ గౌడ్ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వీరస్వామి గౌడ్ పిలుపునిచ్చారు. జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కొంగ జపాలు చేస్తున్నాయని విమర్శించారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అధికారంలో ఉన్న సమయంలో ఈ పార్టీలు అన్యాయం చేశాయని మండిపడ్డారు.

 

రాజ్యాధికార దిశగా బీసీ సమాజం…