భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

12, సెప్టెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

ఇక సులభంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ

WhatsApp Image 2025-09-12 at 14.17.06

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణలో కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. ‘మీ సేవ’ కేంద్రాల్లో నిమిషాల్లోనే పత్రాలు పొందే అవకాశం కల్పించింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు (ప్రత్యేక కేసులు మినహా) ఇప్పుడు మీ సేవ కేంద్రాల్లో నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. గతంలో ప్రతి దరఖాస్తుకు కొత్తగా తహసీల్దార్‌ ఆమోదం పొందాల్సిన అవసరం ఉండేది.

 

దీనివల్ల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో జాప్యం ఏర్పడుతుండడంతో.. ఈ సమస్యను నివారించడానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాలతో.. మీ సేవ విభాగం దీనిపై దృష్టిపెట్టింది. సీసీఎల్‌ఏ, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులు, తహసీల్దార్‌లతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన అనంతరం తాజా మార్పులు చేపట్టారు. ప్రయోగాత్మకంగా ఈ మార్పును 15 రోజుల క్రితం అమల్లోకి తెచ్చారు. ఇప్పటికే 17,571 మంది ఈ సేవను విజయవంతంగా పొందారు. ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. కొత్తగా జారీ చేసే సర్టిఫికెట్‌లో.. గతంలో ఆమోదించిన అధికారి వివరాలు, తిరిగి జారీ తేదీ ఉంటాయి.