భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణలో కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. ‘మీ సేవ’ కేంద్రాల్లో నిమిషాల్లోనే పత్రాలు పొందే అవకాశం కల్పించింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు (ప్రత్యేక కేసులు మినహా) ఇప్పుడు మీ సేవ కేంద్రాల్లో నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు. గతంలో ప్రతి దరఖాస్తుకు కొత్తగా తహసీల్దార్ ఆమోదం పొందాల్సిన అవసరం ఉండేది.
దీనివల్ల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో జాప్యం ఏర్పడుతుండడంతో.. ఈ సమస్యను నివారించడానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…





