♈ మేషం
పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి.
♉ వృషభం
సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు.
♊ మిథునం
చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అయితే ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు ఇబ్బందులు కలిగించవచ్చు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. సంతానం విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి.
♋ కర్కాటకం
చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగవచ్చు. దూరప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి.
♌ సింహం
ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడవచ్చు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. చేపట్టిన పనుల్లో శ్రమ అధికమవుతుంది. సోదరులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో కొంత గందరగోళం ఉంటుంది.
♍ కన్య
నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. దూరపు బంధువుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఉన్న ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.
♎ తుల
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో అధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
♏ వృశ్చికం
వ్యయ ప్రయాసలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. బంధువులతో ఊహించని వివాదాలు ఏర్పడవచ్చు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది. ప్రయాణాల్లో మార్గ అవరోధాలు ఎదురుకావచ్చు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వ్యవహారాలు కొంత మందగిస్తాయి.
♐ ధనుస్సు
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. దూర బంధువులతో వివాదాలు ఏర్పడవచ్చు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో స్వల్ప చికాకులు తప్పవు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి.
♑ మకరం
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగ వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి.
♒ కుంభం
ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
♓ మీనం
చేపట్టిన పనులను మరింత ఉత్సాహంతో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.