భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, ఆగస్టు 2026, గురువారంభారత్ సమాచార్

సమస్యలు పరిష్కరించాలని జీపీ కార్మికుల వినతి

d9e74790-e26e-4ca8-843e-bbdf77d63917

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్మికులు బుధవారం నెల్లికుదురు ఎంపీడీవో సింగారపు కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ప్రతి గ్రామపంచాయతీ కార్మికుడికి ఇళ్ల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

మల్టీపర్పస్ వర్కర్లకు నెలకు రూ.26 వేల చొప్పున వేతనం చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలను నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు. వయస్సు పైబడిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

మల్టీపర్పస్ వర్కర్ల విధానాన్ని రద్దు చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అందరినీ పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు బానోతు వెంకన్న, చంద్రారెడ్డి, బొమ్మనబోయిన సోమయ్య, గుగులోతు మల్సూర్, జి. వెంకటయ్య, జలక వీరయ్య, ఏర్పుల విజయ, చెడుపాక ఉపేంద్ర, ఆరెపల్లి రాధ, తూళ్ళ మంజుల తదితరులు పాల్గొన్నారు.