భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్మికులు బుధవారం నెల్లికుదురు ఎంపీడీవో సింగారపు కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ప్రతి గ్రామపంచాయతీ కార్మికుడికి ఇళ్ల స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
మల్టీపర్పస్ వర్కర్లకు నెలకు రూ.26 వేల చొప్పున వేతనం చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు గ్రీన్ ఛానల్ ద్వారా…





