భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, ఆగస్టు 2026, ఆదివారంభారత్ సమాచార్

అంతర్జాతీయ స్థాయిలో శ్రీవీణకు గుర్తింపు

a3f6398d-c670-485e-a22c-afd6a28bfde3

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామానికి చెందిన పట్నం శెట్టి శ్రీవీణ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుకున్నారు. వ్యవసాయ నేపథ్యానికి చెందిన నాగరాజు కుమార్తె అయిన శ్రీవీణ పరిశోధనా రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అరుదైన గుర్తింపు సాధించారు. ఆమె సాధించిన ఈ ఘనతతో మునిగలవీడు గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభించింది.

శ్రీవీణ రూపొందించిన “A Product Development of Millet Chikki Using Popped Pearl Millet” అనే పరిశోధనా పత్రం IIP సిరీస్‌లో అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితమైంది. ఈ పరిశోధనకు గ్లోబల్ రిజిస్ట్రేషన్ కూడా లభించినట్లు తెలిపారు. పరిశోధనా రంగంలో యువతకు స్ఫూర్తినిచ్చేలా ఆమె ఈ విజయాన్ని సాధించారు.

పెర్ల్ మిల్లెట్‌ (సజ్జలు)ను ఉపయోగించి పోప్డ్ మిల్లెట్‌తో మిల్లెట్ చిక్కీ తయారీపై శ్రీవీణ పరిశోధన నిర్వహించారు. మిల్లెట్లను కేవలం సంప్రదాయ పంటలుగా కాకుండా విలువ ఆధారిత ఆహార ఉత్పత్తులుగా అభివృద్ధి చేయడం ద్వారా వాటి వినియోగాన్ని పెంచే అవకాశాలను ఈ పరిశోధన ద్వారా ఆమె పరిశీలించారు.

మునిగలవీడు గ్రామానికి చెందిన యువతి అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనా పత్రాన్ని ప్రచురించి గుర్తింపు పొందడంపై గ్రామస్థులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీవీణ పరిశోధనా రంగంలో సాధించిన విజయం యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేసి ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.