భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, ఆగస్టు 2026, శుక్రవారంభారత్ సమాచార్

నెల్లికుదురు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మండల కమిటీల ఎన్నిక

49a45ab8-8b07-48b7-99f4-461301258247

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మండల కమిటీలను స్థానిక అమూల్య గార్డెన్‌లో గురువారం ఎన్నుకున్నారు. మండల ఇన్‌చార్జి పోలేపాక ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి జన్ను దినేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా తూల్ల వెంకన్న

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా రాజుల కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉద్యమకారుడు, సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకుడు తూల్ల వెంకన్న వరుసగా నాలుగోసారి ఎంపికయ్యారు. అధికార ప్రతినిధిగా జల్లే ఉపేందర్, ప్రధాన కార్యదర్శులుగా హెచ్. రవి, చాగంటి ప్రశాంత్ మాదిగ, ఉపాధ్యక్షులుగా జల్ల రమేష్, వెల్తూరి నవీన్, లంజాపెళ్లి సురేష్, కోశాధికారిగా శివల నాగేష్, కార్యదర్శులుగా ఈశ్వర్, హెచ్. అశోక్‌లను ఎన్నుకున్నారు.

ఎంఎస్పి మండల అధ్యక్షుడిగా కడారి ఐలయ్య

ఎంఎస్పి మండల అధ్యక్షుడిగా రావిరాల గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు కడారి ఐలయ్య ఎన్నికయ్యారు. అధికార ప్రతినిధిగా ఇడపాక రవి, కార్యదర్శిగా ఎల్లయ్య, ఉపాధ్యక్షుడిగా గుండెపాక వెంకన్నలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు తూల్ల వెంకన్న, కడారి ఐలయ్య మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

అందరి సహకారంతో జాతి హక్కుల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. సంస్థలను మండల స్థాయిలో మరింత బలోపేతం చేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.