భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: టీఎస్ పీఆర్టీయూ మహబూబాబాద్ జిల్లా కమిటీలో నెల్లికుదురు మండలానికి చెందిన 14 మంది ఉపాధ్యాయులకు వివిధ పదవులు దక్కాయి. మండలంలోని వివిధ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు జిల్లా కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆరుగురికి అసోసియేట్ అధ్యక్ష పదవులు, నలుగురికి జిల్లా ఉపాధ్యక్ష పదవులు, మరో నలుగురికి జిల్లా కార్యదర్శి పదవులు లభించాయి.
ఈ మేరకు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మిరియాల సతీష్ రెడ్డి గురువారం జిల్లా కమిటీ పదవులను ప్రకటించినట్లు పీఆర్టీయూ మండల అధ్యక్షుడు సొంటి రెడ్డి యుగేందర్ రెడ్డి తెలిపారు. నెల్లికుదురు మండలం నుంచి 14 మంది ఉపాధ్యాయులకు జిల్లా స్థాయి కమిటీలో అవకాశం లభించడం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
అసోసియేట్ అధ్యక్షులు
అసోసియేట్ అధ్యక్షులుగా సిహెచ్. శ్రీనివాస్, గాయపు లింగారెడ్డి, బిక్కు, రౌతు లక్ష్మినారాయణ, వెంకటేశ్వర్లు, వీరేందర్‌లను ఎంపిక చేశారు.
జిల్లా ఉపాధ్యక్షులు
జిల్లా ఉపాధ్యక్షులుగా ఫనీంద్ర, రాజు, దేవన్న, సాయిప్రసాద్‌లకు బాధ్యతలు అప్పగించారు. జిల్లా కార్యదర్శులుగా చంద్రశేఖర్, సోములు, చంద్రశేఖర్, రవికుమార్‌లు ఎన్నికయ్యారు.
జిల్లా కమిటీలో చోటు దక్కించుకున్న 14 మంది ఉపాధ్యాయులకు పీఆర్టీయూ మండల అధ్యక్షుడు యుగేందర్ రెడ్డి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారంతా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.