భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: టీఎస్ పీఆర్టీయూ మహబూబాబాద్ జిల్లా కమిటీలో నెల్లికుదురు మండలానికి చెందిన 14 మంది ఉపాధ్యాయులకు వివిధ పదవులు దక్కాయి. మండలంలోని వివిధ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు జిల్లా కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆరుగురికి అసోసియేట్ అధ్యక్ష పదవులు, నలుగురికి జిల్లా ఉపాధ్యక్ష పదవులు, మరో నలుగురికి జిల్లా కార్యదర్శి పదవులు లభించాయి.

ఈ మేరకు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మిరియాల సతీష్ రెడ్డి గురువారం జిల్లా కమిటీ పదవులను ప్రకటించినట్లు పీఆర్టీయూ మండల అధ్యక్షుడు…