భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, ఆగస్టు 2026, ఆదివారంభారత్ సమాచార్

స్వర్గీయ సోమయ్యకు ఇనుగుర్తిలో ఘన నివాళి

2f341df7-6ccd-4302-b6df-8904e2b95b8b

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ గణపురం సోమయ్య శనివారం ఆకస్మికంగా కన్నుమూసిన నేపథ్యంలో ఇనుగుర్తి మండల కేంద్రంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. సోమయ్య మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, వివిధ పార్టీల నాయకులు, గుజ్జునూరి బాబురావు, గండు నాగయ్యగౌడ్ తదితరులు స్వర్గీయ సోమయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ తమ్మడపల్లి కుమార్, దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు మాట్లాడుతూ ఇనుగుర్తి మండల కేంద్రంలో నివసించిన సమయంలో సుమారు 25 ఏళ్ల క్రితం సోమయ్య తెలుగుదేశం పార్టీ నాయకుడిగా పార్టీ బలోపేతానికి విశేష సేవలు అందించారని గుర్తుచేశారు. మరోవైపు ఎమ్మార్పీఎస్‌తో పాటు అంబేద్కర్ భావజాలం కోసం అలుపెరగని ఉద్యమం చేశారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహాల ఏర్పాటులో ఆయన కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

అనంతరం నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామానికి వెళ్లి అనతికాలంలోనే సర్పంచ్‌గా ఎన్నికై ప్రజలకు విశేష సేవలు అందించారని నాయకులు కొనియాడారు. ప్రజలతో సన్నిహితంగా ఉంటూ గ్రామ అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న సోమయ్య మృతి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, వార్డు సభ్యులు గోపందాస్ కృష్ణ, దేవులపల్లి పెద్ద వెంకన్న, బూర ఇస్తారి, పప్పుల వెంకన్న (108), బూర ఐలయ్య తదితరులు పాల్గొని స్వర్గీయ సోమయ్యకు నివాళులర్పించారు.