భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

7, సెప్టెంబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

భరత్ కుటుంబానికి సర్పంచ్ స్వాతి భాస్కర్ ఆర్థిక సాయం

భరత్ కుటుంబానికి సర్పంచ్ స్వాతి భాస్కర్ ఆర్థిక సాయం

భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: దేవునిగుట్ట తండాలో గుగులోతు స్వాతి తేజ నాయక్ మాజీ ఎంపీపీ గారి కుమారుడు గుగులోతు భరత్ కుటుంబాన్ని దేవునిగుట్ట తండా సర్పంచ్ స్వాతి భాస్కర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పిన ఆమె, కష్ట సమయంలో వారికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా భరత్ కుటుంబానికి సర్పంచ్ స్వాతి భాస్కర్ రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

అనంతరం ఉప సర్పంచ్ సుశీల రూ.500 ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి తనవంతు అండగా నిలిచారు. అదేవిధంగా వార్డు సభ్యుడు బాలు రూ.1,000 ఆర్థిక సహాయం అందించారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలిచేందుకు గ్రామ నాయకులు ముందుకు రావడం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సర్పంచ్ స్వాతి భాస్కర్ మాట్లాడుతూ.. కష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భరత్ కుటుంబానికి తనవంతు సహాయం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అవసరమైన సమయంలో గ్రామ ప్రజలు, నాయకులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కాలు, గ్రామ పెద్దలు భగవాన్, భావ్‌సింగ్, కాలు శ్రీను, బాలకృష్ణ, సురేష్, బిక్కు, సైదులు తదితర నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. భరత్ కుటుంబాన్ని పరామర్శించి తమ సానుభూతి, మద్దతు తెలిపారు.