భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

భరత్ కుటుంబానికి అండగా సర్పంచ్.. ఆర్థికసాయం అందజేత

భరత్ కుటుంబానికి అండగా సర్పంచ్.. ఆర్థికసాయం అందజేత

భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: దేవునిగుట్ట తండాకు చెందిన గుగులోతు స్వాతి తేజ నాయక్ మాజీ ఎంపీపీ కుమారుడు గుగులోతు భరత్ కుటుంబాన్ని దేవునిగుట్ట తండా సర్పంచ్ స్వాతి భాస్కర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. కష్ట సమయంలో కుటుంబానికి అండగా నిలిచేందుకు సర్పంచ్ స్వాతి భాస్కర్ తన వంతుగా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు.

అనంతరం ఉప సర్పంచ్ సుశీల రూ.500 ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి మద్దతుగా నిలిచారు. వార్డు సభ్యుడు బాలు సైతం రూ.1,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబానికి తమవంతు సహకారం అందిస్తూ ధైర్యం కల్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ స్వాతి భాస్కర్ మాట్లాడుతూ.. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. భరత్ కుటుంబానికి తన వంతు సహాయం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, అవసరమైన సమయంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కాలు, గ్రామ పెద్దలు భగవాన్, భావ్‌సింగ్, కాలు శ్రీను, బాలకృష్ణ, సురేష్, బిక్కు, సైదులు తదితర నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. భరత్ కుటుంబాన్ని పరామర్శించి తమ సానుభూతి, మద్దతు తెలిపారు. కష్ట సమయంలో కుటుంబానికి గ్రామం మొత్తం అండగా నిలుస్తుందని వారు భరోసా కల్పించారు.