భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

ఎంపీ రవిచంద్ర వ్యవసాయ క్షేత్రంలో ఉప్పలమ్మ వేడుకలు

ఎంపీ రవిచంద్ర వ్యవసాయ క్షేత్రంలో ఉప్పలమ్మ వేడుకలు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉప్పలమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పలమ్మకు ప్రత్యేక పూజలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ వేడుకలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, సంఘం ఖమ్మం జిల్లా గౌరవాధ్యక్షులు కొత్త సీతారాములు, ఆకుతోట ఆదినారాయణ, వేం రాంచంద్రారెడ్డి తదితరులు హాజరై ఉప్పలమ్మను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు ఎంపీ రవిచంద్ర కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు.

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సభ్యులు వద్దిరాజు కమలమ్మ, వద్దిరాజు కిషన్–శశిరేఖ, వద్దిరాజు దేవేందర్–ఇందిర, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర–విజయలక్ష్మి, వద్దిరాజు మోహన్–వాసవి, వద్దిరాజు వెంకటేశ్వర్లు–పద్మ, వద్దిరాజు వెంకటేశ్వర్లు–ఉమామహేశ్వరి దంపతులు తదితరులు ఉప్పలమ్మకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

కాగా, వద్దిరాజు కుటుంబ సభ్యుల బంధువులు, మిత్రులు సంగిశెట్టి లక్ష్మీనారాయణ, సంగిశెట్టి శంకర్, సంగిశెట్టి ప్రభాకర్, సంగిశెట్టి రాంమూర్తి–పద్మ, డాక్టర్ జే.ఎన్. వెంకట్, డాక్టర్ గంగుల గంగాభవాని, డాక్టర్ బర్మా వెంకటేశ్వర్లు, డాక్టర్ విజయ్ పాల్–డాక్టర్ మాలతి, బోరిగం సోమయ్య–స్వరూపారాణి, వారి కుమారుడు విజయ్, వద్దిరాజు శ్రీనివాస్, వద్దిరాజు నాగరాజు, జే.ఎన్. విశ్వంత్ రెడ్డి, వద్దిరాజు గిరినందన్ తదితరులు ఉప్పలమ్మను దర్శించుకున్నారు. బీఆర్ఎస్‌కు చెందిన స్థానిక నాయకులు, వివిధ గ్రామాల నాయకులు, గ్రామస్తులు వేడుకల్లో పాల్గొన్నారు.