భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉప్పలమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పలమ్మకు ప్రత్యేక పూజలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ వేడుకలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మున్నూరుకాపు సంఘం…





