భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

8, సెప్టెంబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

మద్యంతాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు: ఎస్‌ఐ శైలేందర్

మద్యంతాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు: ఎస్‌ఐ శైలేందర్

భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని బాల్కొండ ఎస్‌ఐ శైలేందర్ హెచ్చరించారు. బాల్కొండ మండల కేంద్రంలోని నరహరి హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో ఎన్‌హెచ్‌-44పై పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం మత్తులో లారీ నడుపుతున్న ఓ వ్యక్తిని పోలీసులు గుర్తించి వాహనాన్ని నిలిపివేశారు.

లారీ డ్రైవర్‌కు బ్రీత్‌ అనలైజర్‌ ద్వారా ఆల్కహాల్‌ పరీక్ష నిర్వహించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. దీంతో సదరు వ్యక్తిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చలాన్‌ విధించినట్లు ఎస్‌ఐ శైలేందర్‌ తెలిపారు. హైవేలపై వాహనాల రాకపోకలు అధికంగా ఉండే నేపథ్యంలో మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రయాణికుల భద్రతకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఎస్‌ఐ తెలిపారు. హైవేలపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల డ్రైవర్‌తో పాటు ఇతర ప్రయాణికుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆయన సూచించారు.

మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఇకపై కూడా తనిఖీలు కొనసాగుతాయని ఎస్‌ఐ శైలేందర్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు బాధ్యతగా వ్యవహరించి మద్యం సేవించిన తర్వాత డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, రహదారి భద్రతకు సహకరించాలని ఆయన కోరారు.